సెట్స్‌లో ప‌వ‌ర్ స్టార్‌.. వీడియో వైర‌ల్‌

Power star Pawan Kalyan Ak remake shooting.ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 12:50 PM IST
Power star Pawan Kalyan Ak remake shooting.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ చిత్రంతో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 25 నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాగా.. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో షూటింగ్ కోసం జరుగుతున్న సన్నాహాలను చూపించారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టడం, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో మాట్లాడ‌డం.. చివ‌ర‌గా బుల్లెట్‌పై ర‌య్యిమంటూ వెళ్ల‌డం వంటి స‌న్నివేశాలు చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. ఈ చిత్రంలో పవన్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో పది రోజులపాటు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరగనుందని చిత్ర‌బృందం తెలిపింది. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్‌తో పాటు రానా, సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేష్ కూడా జాయిన్ కానున్న‌ట్టు తెలుస్తుంది.




Next Story