ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు పోసాని క్ష‌మాప‌ణ‌లు

Posani Krishna Murali tested covid-19 positive.ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 11:58 AM IST
ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు పోసాని క్ష‌మాప‌ణ‌లు

ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గ‌చ్చిబౌలిలోని ఏసియ‌న్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని పోసాని స్వ‌యంగా వెల్ల‌డించారు. గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి.. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అంతా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో పోసాని ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్ లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి తెలిపారు. పోసానితో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Next Story