మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం : ఆక‌ట్టుకుంటున్న పోరి సూప‌రో పాట‌

Pori Superoo Song released from Macherla Niyojakavargam.యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న‌చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 11:07 AM IST
మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం : ఆక‌ట్టుకుంటున్న పోరి సూప‌రో పాట‌

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న‌చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్‌లు క‌థానాయిక‌లు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా నేడు ఈ చిత్రంలోని మ‌రో పాటను విడుద‌ల చేశారు. ''పోరీ సూపరో " అంటూ ఈ మాస్ సాంగ్ సాగుతోంది. మ‌హ‌తీ స్వ‌ర సాగ‌ర్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురీ పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వినేయండి.

Next Story