ఆక‌ట్టుకుంటున్న‌ 'పోరాట‌మే 2' లిరిక‌ల్

Poratame 2 lyrical video is release.అడివి శేష్ హీరోగా న‌టించిన‌ చిత్రం హిట్ 2.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Nov 2022 1:26 PM IST
ఆక‌ట్టుకుంటున్న‌ పోరాట‌మే 2 లిరిక‌ల్

అడివి శేష్ హీరోగా న‌టించిన‌ చిత్రం 'హిట్ 2'. శైలేష్ కొలను దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో అడివి శేష్ స‌ర‌స‌న మీనాక్షి చౌదరి న‌టించింది. యాక్షన్ తో కూడిన సస్పెన్స్ ఎంటర్టైన‌ర్‌గా రూపుదిద్దుతున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పిస్తుండగా ప్రశాంతి తిపిర్నేని దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబ‌ర్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా 'పోరాట‌మే.. పోరాట‌మే.. 'అనే లిరిక‌ల్ పాట‌ను విడుద‌ల చేసింది. హీరో కార్యదీక్ష, ఆయన ధైర్యసాహసాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ వ‌స్తోంది. 'రక్తమే అంటుకున్న చేతులా .. ఎంతకీ వదిలిపోని మరకలా 'అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణ‌కాంత్ సాహిత్యాన్ని అందించ‌గా సురేశ్ బొబ్బిలి స్వ‌ర‌ప‌రిచారు.

Next Story