సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓ విషాదం నుంచి తేరుకునే లోపే మరో విషాద వార్త వినాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ యాంకర్, సినీ నటుడు ఆనంద కణ్ణన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే.. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం తిరగబడడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ క్యాన్సర్ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో నిన్న (ఆగస్టు 16) తుది శ్వాస విడిచాడు. ఆయన మృతితో కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు నటీనటులు సంతాపం తెలియజేశారు.
సింగపూర్-తమిళియన్ అయిన కణ్ణన్.. 90వ దశకంలో కోలీవుడ్ ఆడియొన్స్‌కు ఫేవరెట్ నటుడు కూడా. ముఖ్యంగా సన్ టీవీ సిరీస్ సింధ్‌బాద్‌లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు.క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియొన్స్‌ను ఆయన అలరించాడు. ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటు చేసి వర్క్‌షాప్స్‌తో రూరల్ కల్చర్ ద్వారా వర‍్ధమాన నటులెందరినో ప్రోత్సహించాడు. 'సరోజ, అదిసయ ఉల్గం' చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు. యూత్ ఐకాన్‌గా పేరున్న ఆనంద ఇలా అకస్మాత్తుగా కన్నుమూయడం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.