సింగ‌ర్ హ‌రిణి కుటుంబం అదృశ్యం.. అనుమానాస్ప‌ద స్థితిలో తండ్రి మృతి

Popular Singer Harini family is missing.ప్ర‌ముఖ ప్లేబ్యాక్ సింగ‌ర్ హ‌రిణి తండ్రి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 7:01 AM GMT
సింగ‌ర్ హ‌రిణి కుటుంబం అదృశ్యం.. అనుమానాస్ప‌ద స్థితిలో తండ్రి మృతి

ప్ర‌ముఖ ప్లేబ్యాక్ సింగ‌ర్ హ‌రిణి తండ్రి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. బెంగ‌ళూరులోని ఓ రైల్వేట్రాక్‌పై ఆయ‌న మృత‌హాన్ని పోలీసులు క‌నుగొన్నారు. హైద‌రాబాద్‌లోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలో హ‌రిణి కుటుంబ స‌భ్యులు నివ‌సిస్తున్నారు. కాగా.. గ‌త‌వారం రోజులుగా హ‌రిణి కుటుంబ స‌భ్యులు అదృశ్య‌మ‌య్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నక్ర‌మంలో హరిణి తండ్రి ఏకే రావు మృత‌దేహాం ల‌భ్య‌మైంది. ప్ర‌మాద‌వ‌శాత్తు రైలు నుంచి కింద‌ప‌డి మృతి చెందారా..? లేక ఎవ‌రైనా హత్య చేసి అక్క‌డ ప‌డ‌వేశారా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఏకేరావు కుటుంబం కొన్నేళ్లుగా శ్రీన‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన త‌రువాత ఏకేరావు సుజ‌నా పౌండేష‌న్‌కు సీఈఓగా ప‌నిచేస్తున్నారు. వారం రోజులుగా ఏకే రావు కార్యాలయానికి రాలేదని అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఆయ‌న‌కు కానీ వారి కుటుంబ స‌భ్యుల‌కు గానీ ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు పోలీసులు రైల్వే ప‌ట్టాల‌పై ఓ మృత‌దేహాన్ని క‌నుగొన్నారు. అది ఏకేరావు దిగా గుర్తించారు. ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? ఎవ‌రైనా హ‌త్య చేసి అక్క‌డ ప‌డ‌వేశారా..? అస‌లు బెంగ‌ళూరుకు హ‌రిణి కుటుంబ స‌భ్యులు ఎందుకు వెళ్లారు. గ‌తం వారం రోజులుగా వారు ఎక్క‌డ ఉన్నారు..? వంటి విష‌యాల‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ సినిమాల్లో హరిణి ఎన్నో పాట‌ల‌ను పాడారు. సుమారు 3500 పైగా పాటల‌ను పాడారు. ఎక్కువ‌గా త‌మిళంలో పాడారు. తెలుగులో 'నేను మీకు తెలుసా', '100 %ల‌వ్‌', 'గుండుంబా శంక‌ర్‌', 'అల్లుడు శ్రీను' వంటి చిత్రాల్లో ఆమె పాట‌లు పాడారు.

Next Story