బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ల లిస్ట్‌.. సెలబ్రిటీలతో హౌస్ కలర్‌ఫుల్..!

Popular Names in Bigg Boss Telugu OTT Season 1 Contestants List.బుల్లితెర‌పై స‌త్తాచాటిన‌ బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Feb 2022 6:58 AM GMT
బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ల లిస్ట్‌.. సెలబ్రిటీలతో హౌస్ కలర్‌ఫుల్..!

బుల్లితెర‌పై స‌త్తాచాటిన‌ బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పుడు ఓటీటీలో అల‌రించేందుకు సిద్ద‌మైంది. 24 గంట‌ల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జ‌రుగుతుందో దాన్నే ఓటీటీలో చూపించ‌నున్నారు. ప్రేక్ష‌కుల‌కు ఇంకా ఎక్కువ వినోదాన్ని అందించేందుకు దీన్ని తీసుకువ‌చ్చారు. కాగా.. తెలుగులో తొలిసారి ఓటీటీలో ప్ర‌సారం కానుండంతో ఎలా ఉంటుందోన‌ని ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది నాన్‌స్టాప్ అంటూ ప్ర‌చారంతో హోరెత్తిస్తున్నారు. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జుననే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. కాగా.. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేప‌ధ్యంలో ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్లపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. వీరే ఆ కంటెస్టెంట్లు అంటూ ఓ లిస్ట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సీజన్‌-1 నుంచి సీజన్‌-5 వరకు ఇద్ద‌రు లేదా ముగ్గురు కంటెస్టెంట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు సోషల్‌మీడియా, యూట్యూబ్‌ నుంచి కొందరు పాపులర్‌ వ్యక్తులను రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ల ఫైన‌ల్ లిస్ట్‌..

- ధనరాజ్‌(సీజన్‌-1)

- ఆదర్శ్‌( సీజన్‌-1)

- ముమైత్‌ ఖాన్‌(సీజన్‌-1)

- తనీష్‌(సీజన్‌-2)

- అషు రెడ్డి( సీజన్‌-3)

- మహేష్‌ విట్టా(సీజన్‌-3)

- అరియానా(సీజన్‌-4)

- అఖిల్‌ సార్థక్‌(సీజన్‌-4)

- సరయూ( సీజన్‌-5)

- హమీదా( సీజన్‌-5)

- నటరాజ్‌ మాస్టర్‌ (సీజన్‌-5)

కొత్త కంటెస్టెంట్లు..

- యూట్యూబర్‌ నిఖిల్‌

- యాంకర్‌ శివ

- యాంకర్‌ స్రవంతి

- ఆర్జే చైతు

- మిస్టర్‌ ఇండియా 2021 మోడల్‌ అనిల్‌ రాథోడ్‌

- బమ్‌ చిక్‌ బబ్లూ

- కప్పు ముఖ్యం బిగులూ

- నటి, మోడల్‌ మిత్రా శర్మ

మ‌రీ ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ల‌లో ఎంత మంది ఉంటారో ఈ నెల 26న‌ తేదీని తెలుస్తుంది.

Next Story