హిట్ సినిమాల రీరిలీజ్‌.. కొంద‌రు అభిమానుల వ‌ల్ల ఏపీలో థియేట‌ర్ల‌కు భారీ న‌ష్టం

Popular movies rerelease Unruly fans cause huge damage to theaters in AP.సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన సినిమాల‌ను రీ రిలిజ్‌

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 3 Sept 2022 1:12 PM IST

హిట్ సినిమాల రీరిలీజ్‌.. కొంద‌రు అభిమానుల వ‌ల్ల ఏపీలో థియేట‌ర్ల‌కు భారీ న‌ష్టం

విశాఖపట్నం : సినిమా హీరోల పుట్టిన రోజు కావొచ్చు.. లేదా ఏదైన ప్ర‌త్యేక సంద‌ర్భంలోనైనా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన సినిమాల‌ను మ‌రోసారి(రీ రిలిజ్‌) విడుద‌ల చేయ‌డం సాధార‌ణంగా జ‌రిగేదే. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ‌త కొంత కాలంగా ఈ ఆన‌వాయితీ కొన‌సాగుతోంది. అయితే.. కొంద‌రు అభిమానుల అత్యుత్సాహం వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో థియేట‌ర్ల‌కు భారీగా ఆస్తి న‌ష్టం వాటిల్లుతోంది.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా పోక‌రి చిత్రాన్ని 380 కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని సెప్టెంబ‌ర్ 2న జ‌ల్సా చిత్రాన్ని 500ల‌కు పైగా థియేట‌ర్ల‌లో మ‌రోసారి విడుద‌ల చేశారు. అభిమానుల సంతోషం కోసం సెప్టెంబర్ 1 రాత్రి నుండి షోలను వేశారు. త‌మ అభిమాన హీరో పుట్టిన రోజు కావ‌డంతో అభిమానులు సినిమా హాళ్ల ముందు రాత్రంతా బ్యాన‌ర్లు పెట్ట‌డం, క్రాక‌ర్లు కాల్చ‌డంతో పాటు పాట‌ల‌కు స్టెప్పులు వేశారు.

అయితే.. కొంద‌రు అభిమానుల అత్యుత్సాహం కార‌ణంగా శ్రీలీలామహల్ థియేటర్, విశాఖపట్నంలోని కిన్నెర-కామేశ్వరి థియేటర్, కర్నూలులోని శ్రీరామ థియేటర్ల‌ల‌తో పాటు మ‌రికొన్ని థియేటర్లకు భారీ నష్టం వాటిల్లింది.

సీట్ల క‌వ‌ర్ల‌ను తొల‌గించ‌డంతో పాటు కుర్చీల‌ను విర‌గొట్టారు. ఒక్కొ థియేట‌ర్‌కు సుమారు రూ.5 నుంచి 6 ల‌క్ష‌ల మేర న‌ష్టం వాటిల్లింది. విశాఖపట్నంలోని ఓ థియేట‌ర్ య‌జ‌మాని మాట్లాడుతూ.. "ప్రేక్షకులను అలరించేందుకు మా థియేటర్లు సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. సినిమాలను మళ్లీ విడుదల చేసే ట్రెండ్‌తో సంతోషిస్తున్నాము. పోకిరి విడుదల సమయంలో అవాంతరాలు వచ్చాయి. దీంతో అభిమానులు త‌మ‌కు క‌నిపించిన వాటిని విసిరివేయ‌డం ప్రారంభించారు. మాకు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది." అని అన్నారు.

ఇక నుంచి రిస్క్ తీసుకోము

ఇక నుంచి ఎగ్జిబిటర్లు ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుక‌నే ఎగ్జిబిటర్లు ఇప్పుడు భారీ అడ్వాన్స్‌లు డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శన తర్వాత ఎటువంటి నష్టం జరగకపోతే.. ఇచ్చిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.

కర్నూలులోని శ్రీరామ థియేటర్ వద్ద సౌండ్ క్వాలిటీ సరిగా లేకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో థియేటర్‌లో రెండు షోలను రద్దు చేశారు. దీంతో నిరాశ చెందిన అభిమానులు థియేటర్ కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు.

"అభిమానులు థియేటర్లలో క్రాకర్లు పేల్చారు. వెళ్ళే ముందు, వారు స్క్రీన్‌ను కూడా చింపివేశారు. భారీ నష్టాన్ని ఎందుకు వారు అర్థం చేసుకోలేరు? మేము ఇకపై అలాంటి రిస్క్ తీసుకోము" అని థియేటర్ యజమాని చెప్పారు.

Next Story