విషాదం.. ప్ర‌ముఖ ఫిల్మ్ క్రిటిక్ హఠాన్మరణం

Popular film critic Kaushik LM passes away. సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Aug 2022 11:19 AM IST
విషాదం.. ప్ర‌ముఖ ఫిల్మ్ క్రిటిక్ హఠాన్మరణం

సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌రి మ‌ర‌ణాన్ని జీర్ణించుకోలేక‌ముందే మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌ముఖ ఫిల్మ్ క్రిటిక్ కౌశిక్ ఎల్ ఎం క‌న్నుమూశారు. సోమ‌వారం సాయంత్రం గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, తోటి క్రిటిక్స్ దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

1987లో జ‌న్మించిన కౌశిక్ కు త‌మిళ‌నాట మంచి గుర్తింపు ఉంది. సినిమా రివ్వ్యూలు రాయ‌డంతో పాటు త‌మిళ‌ న‌టీన‌టుల ఇంట‌ర్వ్యూలు చేయ‌డంలో, బాక్సాఫీస్ రిపోర్టులు, మూవీ అప్ డేట్స్ అందించ‌డంతో ఆయ‌న‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఆయ‌న చ‌నిపోయే ఆరు గంట‌ల ముందు కూడా సీతారామం చిత్రానికి సంబంధించిన ట్వీట్ చేశారు.

కౌశిక్ మ‌ర‌ణం ప‌ట్ల కీర్తి సురేష్, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వెంకట్ ప్రభు, ధనుష్, దివ్యదర్శిని సహా పలువురు ప్రముఖులు సోష‌ల్ మీడియాలో సంతాపం తెలియ‌జేశారు.



Next Story