హాట్‌టాపిక్‌గా పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌.. అప్పుడే బయటపెడతానంటూ..!

Poonam Kaur tweet about Prakash Raj.మా' ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 'మా' ఎన్నికల్లో

By అంజి  Published on  2 Oct 2021 6:26 AM GMT
హాట్‌టాపిక్‌గా పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌..  అప్పుడే బయటపెడతానంటూ..!

'మా' ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. 'మా' ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ సార్‌ గెలిస్తే తాను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతానని పూనమ్‌ కౌర్‌ ట్విటర్‌ వేదికగా అన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్‌ రాజ్‌తో దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ గెలవాలని, ఆయన చిల్లర రాజకీయాలు చేయరని పూనమ్ కౌర్‌ పేర్కొన్నారు. ప్రకాష్‌ రాజ్‌ అయితేనే తాను చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించగలరని నమ్మకంతో పూనమ్ ట్వీట్ చేశారు.

ప్రకాష్‌రాజ్‌ తన మద్దతు ఉంటుందని, జై హింద్‌ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం పూనమ్‌ కౌర్‌ చేసిన ట్వీట్‌ తెగ వైరల్‌ అవుతోంది. శ్రీనివాస కల్యాణం, గగనం, శౌర్యం, గణేష్‌ సహా పలు సినిమాల్లో నటి పూనమ్‌కౌర్‌ నటించారు. ఇప్పటికే 'మా' ఎన్నికల పోటీలు జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపిస్తున్నాయి . అక్టోబర్‌ 10వ తేదీన 'మా' ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ అధ్యక్ష బరిలో పోటీ చేస్తున్నారు. మరోవైపు హీరో మంచు విష్ణు కూడా 'మా' అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

Next Story
Share it