నేనూ తెలంగాణ బిడ్డనే.. వెలివేయ‌కండి : పూనమ్‌ కౌర్‌ భావోద్వేగం

రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న పూన‌మ్ కౌర్ స్టేజీపైనే క‌న్నీళ్లు పెట్టుకుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2023 7:38 AM GMT
Poonam Kaur, Rajbhavan,


రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న పూన‌మ్‌కౌర్‌

'మాయాజాలం' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన న‌టి పూన‌మ్ కౌర్‌. సినిమాల‌తో కంటే వివాదాల‌తోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూన‌మ్ కౌర్‌.. సినిమా విష‌యాల‌తో పాటు రాజ‌కీయ అంశాల‌పై స్పందిస్తుంటుంది. అయితే.. త‌ర‌చుగా ట్రోలింగ్‌కు గుర‌వుతుంటుంది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాజ్‌భ‌వ‌న్‌లో జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొన్న పూన‌మ్ కౌర్ స్టేజీపైనే క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌న‌ను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ భావోద్వేగానికి లోనైంది.

తెలంగాణ రాష్ట్రంలోనే నేను పుట్టాను. ఇక్క‌డే పెరిగాను. అయితే.. నేను పంజాబీని అని, సిక్కు అని మ‌తం పేరుతో న‌న్ను దూరం చేస్తున్నారు. న‌న్ను తెలంగాణ నుంచి దూరం చేయ‌కండి. మ‌తం పేరుతో వెలివేయ‌కండి. నేను తెలంగాణ బిడ్డ‌నే అంటూ పూన‌మ్ తెలిపింది. వరంగల్ మెడికో ప్రీతి మరణం తనను కలచివేసింద‌న్నారు. ప్రీతి మృతికి కారకుడైన నిందితుడిని ఉరివేయడమే సమంజసమన్నారు. పురాణ ఇతిహాసాలు మహిళాశక్తిని బోధిస్తాయని, మహిళల పట్ల గౌరవంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తాయన్నారు.

Next Story