దళపతి మూవీలో బుట్టబొమ్మ..
Pooja Hegde Screening With Vijay. దళపతి విజయ్ కెరియర్‌లో 65వ సినిమాగా ఈ మూవీలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది
By Medi Samrat Published on 5 March 2021 1:20 PM ISTదళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు. ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా మంచి హిట్‌ను అందుకుంది. తెలుగులో మామూలుగా నడిచినా.. తమిళ్‌లో మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లో సాగనుందని టాక్ వినిపిస్తోంది. సినిమాకు రాజకీయ నేపథ్యం హైలెట్‌గా ఉండనుందట. విజయ్ కెరియర్‌లో 65వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమాలో హిరోయిన్‌గా రష్మిక మందన పేరు వినిపించింది. అంతలోనే ఈ ముద్దుగుమ్మ సినిమా నుంచి ఔట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రష్మిక స్థానంలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. పూజ ఇటు తెలుగు సినిమాలతో అటు బాలీవుడ్ సినిమాలతో బిజీబిజీగా ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక విజయ్ 65లో హీరోయిన్ పూజా హెగ్డే అంటూ త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
దళిపతి మూవీ కోసం పూజాహెగ్డే భారీ పారితోషకం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిగ్గా మారింది. ఈ సినిమాలో దళిపతి సరసన నటించేందుకు పూజ ఏకంగా రూ.3.50 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దళిపతి 65వ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక బ్యూటీకి ఎలాగో ఆ క్రేజ్ ఉంది కాబట్టి అంత డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ సినిమా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.