సూపర్ ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్డే

2022లో బీస్ట్‌ సినిమాలో ఇళయ దళపతి విజయ్‌తో కలిసి పనిచేసిన నటి పూజా హెగ్డే, మరోసారి ఆయనతో నటించేందుకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on  2 Oct 2024 8:47 PM IST
సూపర్ ఛాన్స్ దక్కించుకున్న పూజా హెగ్డే

2022లో బీస్ట్‌ సినిమాలో ఇళయ దళపతి విజయ్‌తో కలిసి పనిచేసిన నటి పూజా హెగ్డే, మరోసారి ఆయనతో నటించేందుకు సిద్ధమైంది. పూర్తి స్థాయిలో తమిళనాడు రాజకీయాల్లోకి రాబోతున్న విజయ్ అంతకు ముందే తన 69వ సినిమాను పూర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. తలపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో సూపర్‌స్టార్‌తో స్క్రీన్ స్పేస్‌ను పూజా పంచుకోనుంది. ప్రొడక్షన్ బ్యానర్ KVN ప్రొడక్షన్స్ ఈ వార్తను X లో అధికారికంగా ప్రకటించింది.

2014లో సతురంగ వేట్టై సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హెచ్.వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తర్వాత తీరన్ అధిగారం ఒండ్రు, నేర్కొండ పార్వై, వాలిమై, తునివు వంటి చిత్రాలకు కూడా వినోత్ దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సూర్య 44 చిత్రంలో కూడా నటిస్తూ ఉంది. కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో కూడా రెండు ప్రాజెక్టుల్లో పూజా హెగ్డే బిజీ బిజీగా ఉంది.

Next Story