పొన్నియిన్ సెల్వన్ 2.. మొదటిరోజు భారీ వసూళ్లు

Ponniyin Selvan 2 box office collection day 1. మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై

By Medi Samrat  Published on  29 April 2023 9:00 PM IST
పొన్నియిన్ సెల్వన్ 2.. మొదటిరోజు భారీ వసూళ్లు

Ponniyin Selvan 2


మ‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 2’. పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌లైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్-2 సినిమాకు మొదటి రోజు రూ. 34.02 కోట్లు గ్రాస్ కలెక్ష‌న్స్ వ‌చ్చాయి. షేర్ లెక్కల ప్ర‌కారం ఇది రూ.26.10 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తమిళనాడు - రూ. 17.10 కోట్లు

ఏపీ, తెలంగాణ - రూ. 2.80 కోట్లు

కర్ణాటక - రూ. 4.05 కోట్లు

కేరళ - రూ. 2.82 కోట్లు

రెస్టాఫ్ ఆఫ్ ఇండియా - రూ. 2.55 కోట్లు

ఓవర్సీస్ లో కూడా పొన్నియిన్ సెల్వన్ 2 కు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రీమియర్స్, మొదటిరోజు కలిపి 1.6 మిలియన్ వసూళ్లను సాధించింది ఈ సినిమా.


Next Story