ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న మొట్టమొదటి తమిళ చిత్రం ఇదే.!

'Ponniinselvan-1' movie to be released in IMAX. ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌, లైకా ప్రొడక్షన్స్‌ ఇవాళ సౌతిండియా మూవీ 'పొన్నియిన్‌ సెల్వన్‌-1'ను ఐమ్యాక్స్‌ స్క్రీన్స్‌పై ఈ సెప్టెంబర్‌లో

By అంజి  Published on  17 Aug 2022 7:00 PM IST
ఐమ్యాక్స్‌లో విడుదల కానున్న మొట్టమొదటి తమిళ చిత్రం ఇదే.!

ఐమ్యాక్స్‌ కార్పోరేషన్‌, లైకా ప్రొడక్షన్స్‌ ఇవాళ సౌతిండియా మూవీ 'పొన్నియిన్‌ సెల్వన్‌-1'ను ఐమ్యాక్స్‌ స్క్రీన్స్‌పై ఈ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఐమ్యాక్స్‌ తెరపై విడుదల కాబోతున్న మొట్టమొదటి తమిళ చిత్రం ఇది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న 'పొన్నియిన్‌ సెల్వన్‌-1' విడుదల కానుంది. ఈ మూవీ 10వ శతాబ్దంలో చోళ యువరాజు అరుణ్‌మొజి వర్మన్‌ జీవితపు తొలినాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఆయనే అనంతర కాలంలో రాజ రాజ చోళగా ఖ్యాతిగడించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజుగా ఆయన నిలవడంతో పాటుగా దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సామ్రాజ్యం విస్తరించుకున్నాడు.

'పొన్నియిన్‌ సెల్వన్‌-1' చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీని సుబాస్కరణ్‌, మణిరత్నం నిర్మించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలను రూపొందించిన లైకా ప్రొడక్షన్స్‌ దీనికి నిర్మాణ బాధ్యతలను చేపట్టింది. '' సినీ అభిమానులకు గమ్యస్థానంగా ఐమ్యాక్స్‌ కొనసాగుతోంది. అంతర్జాతీయ వేదికపై మా కంటెంట్‌ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడాన్ని, వైవిధ్యపరచడాన్ని ఎలా కొనసాగిస్తున్నామనేదానికి 'పొన్నియిన్‌ సెల్వన్‌-1' ఒక చక్కటి ఉదాహరణ'' అని ఐమ్యాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ప్రెసిడెంట్‌ మేగన్‌ కొల్లిజన్‌. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని పెద్ద స్కీన్‌కు తీసుకురావడానికి అమితాసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. సింగ్‌, సీఈఓ–లైకా ప్రొడక్షన్స్‌ అన్నారు.

Next Story