ఈ సంక్రాంతి బరిలో పోటీపడనున్న పెద్ద సినిమాలు ఇవే..!

ఈ సారి కూడా సంక్రాంతికి జనాలను ఎంటర్‌టైన్‌ చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 July 2023 1:05 PM IST
Pongal, Telugu Movies, 2024, Tollywood,

ఈ సంక్రాంతి బరిలో పోటీపడనున్న పెద్ద సినిమాలు ఇవే..!

సంక్రాంతి అంటే కొత్త అల్లుల్లు.. బోగి మంటలు.. ముగ్గులు.. పిండివంటలు.. కోడి పందాలు ఇలా సందడిగా ఉంటుంది. ఇక థియేటర్లలోనూ పెద్ద సినిమాలు ప్రతి ఏడాది అలరిస్తాయి. ఈ సారి కూడా సంక్రాంతికి జనాలను ఎంటర్‌టైన్‌ చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ సిద్ధం చేస్తున్నారు. మాస్‌ లుక్‌తో కనిపించనున్న మహేశ్‌ ఈసారి సంక్రాంతికి మరింత జోష్‌ తేనున్నారు. ప్రభాస్‌ మరో భారీ మూవీ 'ప్రాజెక్ట్‌ కే' కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతోంది. రవితేజ 'ఈగల్', తేజ్జ, ప్రశాంత్ వర్మల 'హనుమాన్‌' సినిమాలు కూడా సంక్రాంతికి వస్తాయని ఆయా చిత్ర బృందాలు ఇప్పటికే కన్ఫామ్‌ చేశాయి.

మరిన్ని పెద్ద సినిమాలు కూడా అఫీషియల్‌గా ప్రకటించకపోయినా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి, కళ్యాణ్‌ కృష్ణతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కూడా కనిపిస్తారు. చిరుకు జంటగా త్రిష, సిద్దు జొన్నలగడ్డకు జంటగా శ్రీలీల నటించనున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు చిరుతో మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక విజయ్‌ దేవరకొండ, మృనాల్‌ థాకూర్‌ జంటగా వస్తోన్న VD13 కూడా సంక్రాంతికి వచ్చే చాన్స్‌ ఉంది. నాని 30వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. డిసెంబర్ లో వెంకీ ‘సైంధవ్’ రిలీజ్ కానుంది. అందుచేత నాని సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. మొత్తానికి రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడడం ఖాయం.

Next Story