పొంగల్ రిలీజ్: తమిళ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి కొనసాగుతూ ఉంది. తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.

By Medi Samrat  Published on  16 Jan 2024 8:15 PM IST
పొంగల్ రిలీజ్: తమిళ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..?

సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి కొనసాగుతూ ఉంది. తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హను మాన్, గుంటూరు కారం, సైంధవ్‌, నా సామి రంగ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఇక్కడ విడుదల అవ్వాల్సి ఉండగా.. తెలుగు సినిమాలకే థియేటర్లు దక్కని పరిస్థితుల్లో ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ సినిమాలు మరేవో కాదు ఒకటి ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ కాగా.. మరొకటి శివకార్తికేయన్ నటించిన అయలాన్. ఈ రెండు సినిమాలు తమిళనాడులో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ ఉన్నాయి.

కెప్టెన్ మిల్లర్ నాలుగు రోజుల టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ధనుష్ నటించిన యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శనను దక్కించుకుంది. తమిళనాడులో ఈ సినిమా 24 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఉత్తర భారతదేశంలో 3.5 కోట్లు, కేరళలో దాదాపు 2.8 కోట్లు, కర్ణాటక లో 3.4 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక కెప్టెన్ మిల్లర్ మొత్తం ఆల్ ఇండియా గ్రాస్ దాదాపు 33 కోట్లు కాగా.. ఓవర్సీస్ గ్రాస్ దాదాపు 13.5 కోట్లు ఉంది. దీంతో నాలుగు రోజుల్లో సినిమాకు మొత్తం గ్రాస్ సుమారు 47- 48 కోట్లు వచ్చాయి.

శివ కార్తికేయన్ నటించిన అయాలాన్.. Sci FI కామెడీ డ్రామాగా రూపొందింది. అయాలాన్ 4 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్లు బయటకు వచ్చాయి. 4 రోజులలో ఈ సినిమాకు తమిళనాడులో గ్రాస్ 22 కోట్లు వచ్చింది. ఈ చిత్రం మొదట్లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, 2వ రోజు నుండి కెప్టెన్ మిల్లర్‌ కలెక్షన్స్ తో అయలాన్ పోటీ పడింది. ఈ సినిమాకు ఓవర్సీస్ గ్రాస్ దాదాపు 12 కోట్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల గ్రాస్ దాదాపు 37 కోట్లు వచ్చాయి. పండుగ రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి.

Next Story