అభిమానుల ర‌చ్చ‌.. 'అఖండ' షో ను ఆపేసిన పోలీసులు..!

Police stops Akhanda Movie Show in Australia.నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం అఖండ‌. బోయ‌పాటి శ్రీను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2021 7:46 AM GMT
అభిమానుల ర‌చ్చ‌.. అఖండ షో ను ఆపేసిన పోలీసులు..!

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రం 'అఖండ‌'. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు(గురువారం) ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ అఖండ మేనియా న‌డుస్తోంది. ముఖ్యంగా బాల‌య్య ఇంట్ర‌డ‌క్ష‌న్, ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ స‌న్నివేశాలు పూన‌కాలు తెప్పించే విధంగా ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. 'సింహా', 'లెజెండ్‌' త‌రువాత బోయ‌పాటి-బాల‌య్య కాంబినేష‌న్ లో మూడో బ్లాక్‌బాస్ట‌ర్‌గా 'అఖండ' నిలుస్తుంద‌ని అంటున్నారు.

ఇక స్టార్ హీరోల సినిమాలు విడుద‌లైన తొలి రోజు ఉండే సంద‌డే వేరు. అందులో బాలయ్య న‌టించిన మాస్ చిత్రం అయితే..థియేట‌ర్ల‌లో అభిమానుల ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండ‌గ వాతావ‌ర‌ణం త‌ల‌పించేలా సంద‌డి చేస్తుంటారు అభిమానులు. ప్ర‌స్తుతం మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం 'అఘోరా' ఫీవర్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియాలోని ఓ థియేట‌ర్‌లో అభిమానులు చేసిన ర‌చ్చ‌కు థియేట‌ర్ య‌జ‌మానులు చిత్రాన్ని ఆపేసి మైకుల్లో వార్నింగ్ ఇచ్చార‌ట‌. అయినా అభిమానులు త‌గ్గ‌క‌పోవ‌డంతో పోలీసులు రంగంలోకి దిగార‌ట‌. షో ఆపేసి వార్నింగ్ ఇచ్చి వెళ్లారట.

అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. బాల‌య్య‌ సరసన ప్రగ్యా జైస్వాల్ న‌టించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితరులు కీలక పాత్రల్లో న‌టించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

Next Story
Share it