చిక్కుల్లో రైటర్ అనంత శ్రీరామ్..!
Police case on lyric writer Anantha Sriram.ఇటీవల కాలంలో సినిమాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న సంగతి
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2021 6:05 AM GMTఇటీవల కాలంలో సినిమాలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. తమ మతాన్ని కించపరిచారనో లేదా తమ వర్గాన్ని కించపరిచారనే ఉద్దేశంతో ఎవరో ఒకరు సినిమాను వివాదాల్లో లాగడం కామన్ అయిపోయింది. ఈ వివాదాలు సదరు సినిమాకు కావాల్సిన ప్రమోషన్స్‌ను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా నాగశౌర్య హీరోగా నటిస్తున్న చిత్రం వరుడు కావలెను సినిమాపై కూడా వివాదం రాజుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఈ చిత్రంలోని 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలో 'దిగు దిగు దిగు నాగ' అనేది చాలా పాపులర్ అయిన జానపద గేయం. నాగరాజుపై ప్రేమతో ఈ భజన గేయాన్ని పాడుకుంటారు. రీతూ వర్మ కాలు కదిపిన ఈపాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా తమన్ మ్యూజిక్ అందించాడు. అయితే.. ఈ పాటలో తమ దేవుడిని కించపరిచే విధంగా పాట రాశారు అని చెబుతూ ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ మీద కొందరు మండిపడుతున్నారు.
నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్ పై అలాగే సినిమా బృందం పై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బహుశా అనంత శ్రీరామ్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి ఉండొచ్చని అంటున్నారు.