బిగ్‌బాస్ ఫేమ్ సరయు పై కేసు నమోదు
Police Case Filed Against Sarayu.యూట్యూబ్ నటి సరయు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. తన బోల్ట్
By తోట వంశీ కుమార్ Published on
6 Feb 2022 9:12 AM GMT

యూట్యూబ్ నటి సరయు గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. తన బోల్ట్ కామెంట్స్‌తో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లోనూ మెరిసింది. అయితే.. తాజాగా సరయుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హోటల్ ప్రచార పాటలో హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై ఉన్న అభియోగం.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్.. సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హోటల్ ప్రమోషనల్ పాటలో సరయుతో పాటు మరికొంతమంది గణపతి బప్పా మోరియా బ్యాండ్‌లను తలకు ధరించి మద్యం సేవించారని.. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వీహెచ్‌పీ నేత ఆక్షేపించారు. ఇలాంటి వాటిని హిందూ సమాజం సహించదన్నారు. అలాంటి వారినిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన రాజన్న సిరిసిల్ల పోలీసులు కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
Next Story