పిట్ట‌క‌థ‌లు ట్రైల‌ర్ టాక్‌.. ఉద్వేగం-క‌న్నీళ్లు

Pitta Kathalu Official Trailer.బాలీవుడ్‌లో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ల‌స్ట్ స్టోరీస్ సిరీస్‌ను తెలుగులో పిట్ట‌క‌థ‌లు పేరుతో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2021 7:38 AM GMT
Pitta Kathalu Official Trailer

బాలీవుడ్‌లో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన 'ల‌స్ట్ స్టోరీస్' సిరీస్‌ను తెలుగులో 'పిట్ట‌క‌థ‌లు' పేరుతో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ దీనిని తెర‌కెక్కిస్తోంది. ఆధునిక స్వతంత్ర్య భావాలు కలిగిన మహిళల గురించి నలుగురు దర్శకులు కలిసి ఈ కథా సంకలనాన్ని రూపొందించారు. టాలెంటెడ్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో ఈషా రెబ్బా, సాన్వే మేఘన, అమలా పాల్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 19న 'పిట్టకథలు' విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఆంథాలజీ ట్రైలర్ ని విడుద‌ల చేశారు.

ఆమె మ‌న‌సులో మాట అత‌నికి తెలుస్తా..? తెలీదా..? తెలిసి తెలియ‌న‌ట్టు న‌టిస్తున్నాడా..? అంటూ ప్రారంభ‌మైన ట్రైల‌ర్ ఆక్టుకునే ఉంది. శాన్వీ మేఘన ప్రధాన పాత్రలో నటించిన 'రాముల' అనే కథకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించ‌గా.. జగపతిబాబు - అమలా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మీరా' స్టోరీని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. శృతి హాసన్ లీడ్ రోల్ లో రూపొందిన 'ఎక్స్ లైఫ్' కథకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈషా రెబ్బా - సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింకీ' విభాగానికి సంజల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రేమ, కోరిక అనే రెండు అంశాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది.
Next Story
Share it