పెప్సీ ఆంటీ మాస్ మ‌సాలా సాంగ్ విడుద‌ల

PepsiAunty​ Lyrical Song released.తాజాగా ఆదివారం 'సీటీమార్‌' చిత్రం నుంచి 'నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్ళికి నేనే యాంటీ..' అనే పాట‌ను విడుద‌ల చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 March 2021 7:27 AM GMT
PepsiAunty​ Lyrical Song released

గోపిచంద్ న‌టిస్తున్న తాజా చిత్రం 'సీటీమార్‌'. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తోంది. ఏప్రిల్ 2 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. తాజాగా ఆదివారం ఈ చిత్రం నుంచి 'నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్ళికి నేనే యాంటీ..' అనే పాట‌ను విడుద‌ల చేశారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించ‌గా.. కీర్త‌న శ‌ర్మ ఈ సాంగ్‌ను పాడింది. ద‌ర్శ‌కుడు సంప‌త్ నందే ఈ పాట‌ను రాశాడు. ఈ పాట‌లో అప్స‌ర రాణి స్టెప్పుల‌తో ఓ ఊపు ఊపేసింది.

'మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను.. నెలలు నిండక ముందే భూమ్మీద పడ్డాను.. బారసాల కాకముందే బోర్లా పడ్డాను.. టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను.. ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను.. డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసేశాను.. పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను' వంటి పదాలతో కుర్రకారుకు కిర్రెక్కించేలా ఉందీ పాట. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్‌ర్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న సీటీమార్ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది.

గోపీచంద్ ఏపీకి కోచ్‌గా .. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి జ్వాలా రెడ్డి అన్న సాంగ్ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సీటీమార్ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్.
Next Story
Share it