సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్.. సితార స్పెషల్ ఎంట్రీ
Penny Song Promo from Sarkaru Vaari Paata.సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.
By తోట వంశీ కుమార్ Published on
19 March 2022 6:31 AM GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. థమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన 'కళావతి' పాట య్యూటూబ్‌లో రికార్డులన్ని తిరగరాస్తోంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్దమైంది.
అందులో భాగంగా కొద్ది సేపటి క్రితం'పెన్నీ' అంటూ సాగే సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా.. మరో సర్పైజ్ ఇచ్చింది చిత్రబృందం. ఈ పాటలో సితార కూడా కన్పించడం మహేష్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సాంగ్ లో ఎవరూ ఊహించని విధంగా సితార మెరవడం, ఆమె అద్భుతమైన స్టెప్పులు మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఇక పూర్తి పాటను రేపు(ఆదివారం) విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story