ఆక‌ట్టుకుంటున్న 'పెళ్లి సంద D' ట్రైలర్‌

Pelli Sandad trailer release.హీరో శ్రీకాంత్‌, రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంతో 1996లో వ‌చ్చిన పెళ్లిసంద‌డి చిత్రం ఎంత‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2021 7:33 AM GMT
ఆక‌ట్టుకుంటున్న పెళ్లి సంద D ట్రైలర్‌

హీరో శ్రీకాంత్‌, రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంతో 1996లో వ‌చ్చిన పెళ్లిసంద‌డి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. ఈ చిత్రానికి కొన‌సాగింపుగా 'పెళ్లి సంద D రూపుదిద్దుకుంటోంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ క‌థానాయ‌కుడిఆ ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు విడుద‌ల చేశారు. ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంద‌ని.. రాఘవేంద్రరావు గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు.

ఇక ట్రైలర్ లో పెళ్లి సందడి బాగుంది. కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కొత్త దర్శకురాలు గౌరి రోనక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రోష‌న్ స‌ర‌స‌న శ్రీ లీలా న‌టిస్తోంది. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ - ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తునారు. కాగా.. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story