ఇన్‌స్టాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పోస్టు వైరల్.. ఏంటో తెలుసా?
పవన్ ఇన్‌స్టాలో ఒక వీడియోలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌నే షేక్ చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 July 2023 11:59 AM ISTఇన్‌స్టాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పోస్టు వైరల్.. ఏంటో తెలుసా?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఆయన అలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో... అభిమానులు రికార్డు స్థాయిలో ఫాలో కొట్టారు. కేవలం గంటల వ్యవధిలోనే లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు. జూలై 4న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పవన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టా ఖాతాలో తొలి పోస్టు ఏం పెడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా పవన్ ఇన్‌స్టాలో ఒక వీడియోలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌నే షేక్ చేస్తోంది.
'ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. జైహింద్..' నినాదంతో పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇన్‌స్టాను కూడా పొలిటికల్‌గానే వినియోగిస్తారని.. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతారని అనుకున్నారు. దాంతో మొదటి పోస్టు ఏం ఉంటుందనే ఆసక్తి అందర్లో నెలకొంది. ఆయన సినిమా రంగానికి సంబంధించిన వీడియోను పోస్టు పెట్టి ఆశ్చర్యపరిచారు. సినీ కెరీర్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను ఓ వీడియో రూపంలో పొందుపర్చి దాన్ని షేర్ చేశారు. 'చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను'. అని వీడియో ప్రారంభం అయ్యింది. మన బంధం ఎలానే కొనసాగాలని, ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ.. అని క్యాప్షన్ ఇచ్చి జోడించారు. ఎంతో మంది ప్రముఖులతో పవన్ కలిసి తీసుకున్న ఫోటోలు అభిమానులకు ఎంతో నచ్చాయి. వీడియోకు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు అభిమానులు.
పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో కలిసి 'బ్రో' సినిమా చేశాడు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాదు సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' మూవీలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'ఉస్తాద్‌భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' సినిమాలు లైన్లో ఉన్నాయి.