పవన్ 'హరిహర వీరమల్లు'పై నిర్మాణ సంస్థ అప్‌డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న మరో సినిమా 'హరిహర వీరమల్లు'.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 3:17 PM GMT
pawan kalyan, harihara veera mallu, movie, update ,

 పవన్ 'హరిహర వీరమల్లు'పై నిర్మాణ సంస్థ అప్‌డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న మరో సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. కొంత కాలం నుంచి హరిహర వీరమల్లు మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దాంతో.. ఈ సినిమా వస్తుందా? లేదా అనుమానాలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన మెగా సూర్య ప్రొడక్షన్స్.. సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయని వెల్లడించింది. అభిమానులను సీటు అంచున కూర్చోబెట్టే ప్రోమోను కూడా త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. అప్పటి వరకు వేచి చూడాలంటూ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కోరింది మెగా సూర్య ప్రొడక్షన్స్.

హరిహర వీరమల్లు సినిమా నేపథ్యం 17వ శతాబ్దంలో ఉంటుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నారు. పవన్ పక్కన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించనుంది. ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ బిజీ అయ్యారు. దాంతో.. సినిమా షూటింగ్స్‌లో మార్పులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిత్ర యూనిట్‌ నుంచి కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో సినిమా ఉంటుందా? లేదా అనే ప్రశ్న కూడా కలిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక్క పోస్టుతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్లు అయ్యింది.

Next Story