పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు'.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 10:53 AM IST
pawan kalyan, hari hara veeramallu, movie, teaser, release date ,

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీలో ఎన్నికలు ఉన్న కారణంగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో సినిమా ఎప్పుడు వస్తుందా అని.. ఏదైనా అప్‌డేట్ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లు చిత్ర యూనిట్ పవన్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు. తాజాగా డేట్‌ అండ్‌ టైమ్‌ను కూడా ఫిక్స్‌ చేశారు.

ఈ మేరకు చిత్ర యూనిట్‌ గతంలో టీజర్‌ గురించి ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టింది. మీ ముందుకు.. ధర్మం కోసం యుద్ధం త్వరలో..! అంటూ టీజర్‌ను అతి త్వరలోనే విడుదల చేయనున్నామని మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ అధికారికంగా ఎక్స్‌లో పోస్టు ఇంతకు ముందే చేసింది. తాజాగా టీజర్‌ విడుదల తేదీ.. టైమ్‌ను ప్రకటించారు. హరిహర వీరమల్లు టీజర్‌ను గురువారం (మే 2వ తేదీ) ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్‌ వీరమల్లు గెటప్‌ షెడ్‌ కనిపిస్తోంది. చేతిలో పవర్‌ ఫుల్‌కత్తితో యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా పవన్ కల్యాణ్ కనిపిస్తున్నారు. టీజర్‌ విడుదలపై డేట్‌ అండ్‌ టైమ్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. కొద్దిరోజులుగా హరిమర వీరమల్లు సినిమా ఆగిపోయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పొలిటికల్‌గా బిజీ కావడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే కష్టం అనుకున్నారు. ఈ క్రమంలోనే మూవీ నిర్మాత ఏఎం రత్నం ఎప్పటికప్పుడు స్పందిస్తూ సినిమా గురించి అప్‌డేట్‌ ఇస్తూనే వచ్చారు. ఇక సినిమా ఆగిపోలేదనే విషయాన్ని గట్టిగా చెప్పేందుకే హరిహర వీరమల్లు నుంచి టీజర్‌ను విడుదల చేస్తున్నారని పలువురు అంటున్నారు. ఇక ఏపీలో ఎన్నికల ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.


Next Story