పవన్ "OG" సినిమాకు రూ.250 కోట్లు..కేరీర్‌లోనే రికార్డు

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో వస్తోన్న సినిమా "OG".

By Srikanth Gundamalla  Published on  29 Jun 2023 8:24 PM IST
Pawan Kalyan, OG, Movie, Highest Budget,

పవన్ "OG" సినిమాకు రూ.250 కోట్లు..కేరీర్‌లోనే రికార్డు

పవన్‌ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి "OG". ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గతంలో ఆయన నిర్మించిన భారీ బడ్జెట్‌ మూవీ ఆర్ఆర్ఆర్. పాన్‌ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. పవన్‌ నటిస్తోన్న "OG" సినిమా సాహో ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో పేరున్న నిర్మాత, డైరెక్టర్‌, యాక్టర్‌ కాంబినేషన్లో వస్తోన్న "OG" సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారని చెప్పాలి. అందరికంటే "OG" సినిమా పవన్‌ కళ్యాణ్‌కు ప్రత్యేకం.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో భారీ బడ్జెట్‌తో వస్తోన్న సినిమా ఇది. స్క్రిప్ట్‌ ఎంతో బాగుండటంతో నిర్మాత డీవీవీ దానయ్య అస్సలు ఖర్చుకి వెనకాడటం లేదట. ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు దానయ్య రూ.250 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు సమాచారం. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే ఎంత అయినా ఖర్చుపెట్టేందుకు వెనకాడనని డీవీవీ దానయ్య చెబుతున్నారట. రూ.500 కోట్లతో ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించారు దానయ్య. ఇప్పుడు దాంట్లో సగం అంటే.. రూ.250 కోట్లతో పవన్‌ సినిమా "OG"ని నిర్మిస్తున్నారు. అయితే.. పవన్‌ కెరీర్‌లోనే ఇదే భారీ బడ్జెట్‌ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కి ‘ఉస్తాద్ భగత్ సింగ్,’ హరి హర వీర మల్లు’, “బ్రో’ వంటి పెద్ద సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అతని కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రంగా ‘OG’ తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, అర్జున్ దాస్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి చేస్తునున్నారు. తెలుగులో ఇమ్రాన్‌కు ఇదే తొలి సినిమా.

Next Story