HBD PSPK: 'హరిహర వీరమల్లు' పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 10:02 AM ISTHBD PSPK: 'హరిహర వీరమల్లు' పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సినిమాపరంగానే కాదు.. రాజకీయంగానూ అభిమానులు, ఫాలోవర్స్ ఉన్నారు. అయితే.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు తాజా చిత్ర 'హరిహర వీరమల్లు' నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అర్ధరాత్రి 12.17 గంటలకు పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే.. విడుదలైన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా కనిపిస్తున్నారు. గుబురు గడ్డంతో, చాలా సీరియస్ లుక్‌తో ఉన్నారు. ఈ పోస్టర్ ఒక ఫైట్ సీన్‌కు సంబంధించింది అని అర్థం అవుతోంది.
ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన పోస్టర్స్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎన్నికల లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. మరోవైపు పోస్టర్ రిలీజ్ సందర్భంగా మేకర్స్ పవన్ కళ్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. అసాధారణ ధైర్యసాహసాలు, దయ, అపరిమితమైన కరుణ కలిగిన పవన్ పుట్టినరోజును ఈ సంతోషకమైన రోజున జరుపుకుంటున్నామని ట్వీట్ చేసింది.
కాగా.. ఈ ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఒక్క పోస్టు పెట్టకపోయినా ఫాలోవర్స్ కొన్ని గంటల్లోనే మిలియన్‌కు పైగా చేరింది. దాంతో రికార్డు సృష్టించారు. అంతేకాదు.. గతంలో 2014లో గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీ పొలిటిషియన్‌గా పవన్ నిలిచారు. పవన్ నటించిన ‘తొలిప్రేమ’ జాతీయ అవార్డుతోపాటు వివిధ విభాగాల్లో ఆరు నంది పురస్కారాలు దక్కించుకుంది. ‘జాని’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లకు కథ, ‘గుడుంబా శంకర్’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసింది పవనే. ‘జాని’కి దర్శకత్వం కూడా వహించారు. ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషి’, ‘జానీ’, ‘గుడుంబా శంకర్’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లోని కొన్ని స్టంట్స్‌కు పవన్ కొరియోగ్రఫీ చేశారు.
సింపుల్‌గా ఉండాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్.. సినిమాల్లోకి రాకముందు ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో కొన్ని రోజులు, ఓ గిడ్డంగిలో రెండు రోజులు పనిచేశారు. వ్యవసాయం కూడా చేస్తుంటారు. ఫామ్‌లోనే ఎక్కువసేపు గడిపేవారు పవన్. పుస్తకాలను చదవడాన్ని ఇష్టంగా మలుచుకున్నారు. వెంటవెంటనే సినిమాలు చేసేయాలనే ఆలోచన పవన్‌కు ఉండదు. తన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, అభిమానులను మెప్పించేగలిగే పవర్‌ఫుల్ రోల్స్, సందేశాత్మకమైన కథలనే ఎంపిక చేసుకుంటారు. అందుకే.. 27 ఏళ్ల ప్రస్థానంలో పవన్ 28 సినిమాల్లో నటించారు. వాటిలో 12 రీమేక్‌లు. కాగా.. పవన్ ప్రస్తుతం ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు పాలిటిక్స్‌లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.