గురువును ఢీ కొట్టబోతున్న శిష్యుడు

Pawan Kalyan and Nithiin movies releases on Same Day.టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు హీరో నితిన్‌కు మ‌ధ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2021 7:03 AM GMT
గురువును ఢీ కొట్టబోతున్న శిష్యుడు

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు హీరో నితిన్‌కు మ‌ధ్య మంచి అనుభ‌వం ఉందన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే నితిన్‌కు చాలా ఇష్టం. తాను న‌టించే సినిమాల్లో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల‌లో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండా ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇక ప‌వ‌న్ కూడా త‌న వంతు సాయంగా నితిన్ సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తుంటారు. అలాంటిది అభిమాన హీరోతోనే ఇప్పుడు బాక్సాఫీస్ పోటికి సిద్ద‌మ‌య్యాడు నితిన్‌. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో నితిన్ న‌టిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ స‌ర‌సన కృతి శెట్టి న‌టిస్తోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ విడుద‌లైంది. ఈ చిత్ర విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 29,2022న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే.. స‌రిగ్గా అదే రోజున ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న‌ 'హరిహర వీరమల్లు' చిత్రం కూడా విడుద‌ల కానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఏ. ఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి అయ్యింది.

ప‌వ‌న్‌, నితిన్ చిత్రాలు ఒకే రోజున విడుద‌ల కానుండ‌డంతో అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి నితిన్ చివరి వరకు పోటీలో ఉంటాడా..? లేదా త‌ప్పుకుంటాడా..? లేదా పవన్ థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే సంకేతాలు ఏమైనా అందడంతోనే నితిన్ ఈ డేట్‌ను లాక్ చేశాడా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Next Story
Share it