షారుక్ ఖాన్ 'పఠాన్' టీజర్.. గూస్ బంప్స్ వ‌స్తున్నాయి

Pathaan Teaser Shah Rukh Khan Is Back "With A Bang".షారుక్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'పఠాన్' టీజర్ విడుద‌లైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 1:28 PM IST
షారుక్ ఖాన్ పఠాన్ టీజర్.. గూస్ బంప్స్ వ‌స్తున్నాయి

న‌వంబ‌ర్ 2.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పుట్టిన రోజు. ఇప్ప‌టికే సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. షారుఖ్ సినిమా వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు దాటిపోయింది. షారుక్ కొత్త సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్ల లోటును పూడ్చేందుకు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు బాద్ షా. అందులో 'ప‌ఠాన్' చిత్రం ఒక‌టి. సిద్ధార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈచిత్రంలో జాన్ అబ్ర‌హం, దీపికా ప‌దుకొణె కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

కాగా.. నేడు షారుక్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. "ప‌ఠాన్ గురించి నీకు ఏం తెలుసు..?" అనే డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. "మూడేళ్ల నుంచి అత‌డి జాడ లేదు. చివ‌రి మిష‌న్‌లో అత‌డు ప‌ట్టుబ‌డ్డాడు. అత‌డిని వేదించార‌ని విన్నా. ప‌ఠాన్ బ‌తికి ఉన్నాడో లేదో తెలియ‌దు." అనే డైలాగ్‌తో షారుక్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు.

పఠాన్‌ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. అసలు పఠాన్‌ మూడేళ్లు ఎక్కడ ఉన్నాడు. టెర్రరిస్ట్‌ల నుండి ఎలా తప్పించుకున్నాడు. టెర్రరిస్ట్‌లను షారుఖ్‌ ఎలా అంతమొందించాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. యాక్ష‌న్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story