ఆరో వివాహం.. ఈ సారి బాడీ గార్డ్ ను పెళ్లి చేసుకున్న నటి
Pamela Anderson ties the knot with bodyguard Dan Hayhurst.పమేలా ఆండర్సన్ ఆరో వివాహం.. ఈ సారి బాడీ గార్డ్ ను పెళ్లి చేసుకున్న నటి
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2021 4:38 PM ISTపమేలా ఆండర్సన్.. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ ఈమె. 50 ఏళ్ళు దాటినా కూడా తన హాట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదు. ఒకప్పుడు బేవాచ్ సిరీస్ తో కుర్రకారు మతిని పోగొట్టిన పమేలా లాక్ డౌన్ లో తన బాడీగార్డ్ ను పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
గతేడాది ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పెళ్లి చేసుకుంది కానీ.. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడికి దూరం అయ్యింది. ఒంటరిగా ఉన్న ఆమె లాక్‌డౌన్‌లో తన బాడీగార్డు డాన్ హేహర్ట్స్‌ను పెళ్లి చేసుకుంది. కెనడాలోని తన వ్యాన్‌కౌవేర్ ఐలాండ్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఆమెకు ఇది ఆరోవ వివాహం. గతేడాది రహస్య వివాహం చేసుకున్న పమేలా అండర్సన్(53) వెడ్డింగ్ ఫ్రాక్‌లో తన భర్త డాన్‌తో కలిసి ఉన్న పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలా తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేగాక తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను తొలగిస్తున్నట్లు చెప్పేసింది. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో నేను డాన్ హేహర్డ్స్‌తో ప్రేమలో పడ్డాను. దీంతో అతడిని వివాహం చేసుకున్నాను. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను అని చెప్పుకొచ్చింది పమేలా.
చర్చి పాస్టర్స్, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని పమేలా. జనవరి 2020లో ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌ను అయిదవ వివాహం చేసుకున్న పమేలా 12 రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. టామీ లీ, కిడ్ రాక్ లను పెళ్లి చేసుకున్న పమేలా ఆ తర్వాత రిక్ సాలమన్ ను రెండు సార్లు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జాన్ పీటర్స్ ను.. ఇప్పుడు తన బాడీ గార్డ్ ను ఆరోసారి వివాహం చేసుకుంది. పమేలాకు ఇద్దరు పిల్లలు.