పైన పటారం ఈడ లోన లొటారం అంటున్న అన‌సూయ

Paina Pataaram Video Song Promo released.యువ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 12:09 PM GMT
పైన పటారం ఈడ లోన లొటారం అంటున్న అన‌సూయ

యువ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా. నూత‌న ద‌ర్శ‌కుడు పెగ‌ళ్ళ‌పాటి కౌళిక్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. రొమాంటిక్, యాక్షన్ జానర్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా మరో పాటను రిలీజ్‌కు సిద్దం చేశారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌గా రూపొందిన 'పైన పటారం ఈడ లోన లొటారం' అంటూ సాగనున్న ఈ పాటలో బుల్లితెర బ్యూటీ అనసూయ ఆడి పాడింది.


ఈరోజు ఈ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో అనసూయ తన డాన్స్‌తో అందరినీ కట్టిపడేస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్ పాత్రలో క‌నిపించ‌నుండ‌గా.. లావ‌ణ్య త్రిపాఠి న‌ర్సుగా న‌టిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story
Share it