'పాగ‌ల్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Pagal Movie OTT release date fix.విశ్వక్ సేన్ హీరోగా న‌టించిన చిత్రం పాగ‌ల్‌. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Sept 2021 10:42 AM IST
పాగ‌ల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

విశ్వక్ సేన్ హీరోగా న‌టించిన చిత్రం 'పాగ‌ల్‌'. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విశ్వ‌క్‌సేన్ స‌ర‌స‌న నివేదా పేతురాజ్ న‌టించింది. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర కియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్టు 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకోవ‌డంతో పాటు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను కూడా సాధించింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైంది.

అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 3న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌.. బెక్కెం వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో మా 'పాగల్' సినిమాను విడుదల చేశాం. ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కులు చాలా చ‌క్క‌గా ఆద‌రించార‌న్నారు. మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయ‌ని తెలిపారు. ఈ సినిమాను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామ‌ని చెప్పారు. నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక సెప్టెంబర్ 3న ఈ సినిమా ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతుంది. శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోయాయి. ఇక మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తేనే భారీ కలెక్షన్స్ ఉంటాయి. వాళ్లు లేకపోతే కలెక్షన్స్ అనుకున్నంతగా ఉండవని చెప్పారు.

Next Story