'మాస్ కా దాస్‌' విశ్వ‌క్ సేన్.. 'పాగ‌ల్'‌ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Pagal Movie First Look Release. 'మాస్ కా దాస్‌' విశ్వ‌క్ సేన్.. 'పాగ‌ల్'‌ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌.

By Medi Samrat  Published on  2 Feb 2021 4:58 AM GMT
Pagal Movie First Look Release

'మాస్ కా దాస్‌' విశ్వ‌క్ సేన్.. వెళ్లిపోమాకే తో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ఈ న‌గ‌రానికి ఏమ‌యింది, ఫ‌లక్‌నామా దాస్, హిట్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో. తాజాగా పాగ‌ల్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తుండ‌గా.. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. తాజాగా పాగ‌ల్ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.


ఇందులో విశ్వ‌క్ సేన్ స్లిమ్‌గా సరికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఏప్రిల్ 30న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ని చిత్ర‌యూనిట్‌ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఈ సినిమాకు మణికందన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేయ‌గా.. గూఢచారి ఫేం గ్యారీ సర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి ఫేం రధాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.


Next Story