ఓయ్.. రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించిందిగా!!

'ఓయ్' సినిమాకు వాలెంటైన్స్ డే నాడు ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Feb 2024 4:38 PM IST
oye movie, re-release, collection record,

ఓయ్.. రీ రిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించిందిగా!!

డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'ఓయ్' చిత్రానికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, షామిలి ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమాను ఫ్లాప్ చేశారు కానీ.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. అయితే పలు మెట్రో నగరాల్లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. హౌస్ ఫుల్స్ పడ్డాయి. సినిమాలోని పాటలను యువత ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

'ఓయ్' సినిమాకు వాలెంటైన్స్ డే నాడు ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి. ఇటీవల పలు సినిమాల రీరిలీజ్ ను ఫ్లాప్ గా నిలవగా.. ఓయ్ సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. BookMyShow డేటా ప్రకారం "ఓయ్" వాలెంటైన్స్ డే రోజున బాగా కలెక్షన్స్ వచ్చాయి. 24 గంటల్లో 20వేలకు పైగా టిక్కెట్లు బుక్ చేశారు. రవితేజ “ఈగల్” సినిమాకు కేవలం 13k టికెట్లు రాగా.. రజనీకాంత్ “లాల్ సలామ్” బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ప్రేమికుల రోజున విడుదలైన తాజా చిత్రాలలో ఓయ్ మంచి ఆధిపత్యాన్ని సాధించింది. ఫ్రెష్‌గా అనిపించని.. కొత్తదనం లేని ఏ సినిమా కూడా ప్రస్తుతం భారీ ప్రమోషన్‌లు లేకపోతే జనం చూడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 'ఓయ్' సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రం రీ-రిలీజ్ అయిన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజంగా మంచి కలెక్షన్స్ అనే చెప్పుకోవచ్చు.

Next Story