ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే
ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ సారి చూద్దాం.
By తోట వంశీ కుమార్ Published on 9 March 2023 11:06 AM ISTఈ వారం థియేటర్లలో స్టార్ హీరోల చిత్రాలు ఏవీ విడుదల కావడం లేదు. అయితే.. ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్‌సిరీస్‌లు, చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరీ ఈ వారం ప్రేక్షకుల అలరించేందుకు రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవో ఓ సారి చూసేద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
రానా నాయుడు - మార్చి 10
వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రేఖ (మలయాళ చిత్రం) - మార్చి 10
డిస్నీ + హాట్‌స్టార్:
యాంగర్ టేల్స్ - మార్చి 9
బిందుమాధవి, మడోన్నా సెబాస్టియన్, సుహాస్ మరియు శ్రీరామ్ రెడ్డి పొలాసనేతో కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్. ఎన్నో ఆశలతో ఉన్న నలుగురికి వారి జీవితంలో నచ్చనిది ఎదురైతే వారి మానసిక సంఘర్షణ ఏంటీ..? దాని వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి..? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
రన్ బేబీ రన్ (తమిళ చిత్రం) – మార్చి 10
ఆహా
మందాకిని - మార్చి 8
హిమ బిందు మరియు ప్రియా హెగ్డే నటించారు. ఒక యువతి తన జీవితంలో ఎదుర్కొనే విచిత్రమైన సంఘటనలే ఈ కథ. మార్చి 8 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
క్రిస్టోఫర్ (మలయాళ చిత్రం- తెలుగు డబ్) – మార్చి 9
SonyLIV:
బ్యాడ్ ట్రిప్ (తెలుగు సినిమా) – మార్చి 10
ఈ వెబ్ షో మార్చి 10న SonyLIVలో డిజిటల్ ప్రీమియర్‌ల కోసం సిద్ధంగా ఉంది.
క్రిస్టీ (మలయాళ చిత్రం) – మార్చి 10
యాక్సిడెంటల్ ఫార్మర్ & కో (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 10
జీ 5
రేమో - మార్చి 10
పవన్ వడయార్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ-భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం ఇప్పుడు మార్చి 10న Zee5లో డిజిటల్ ప్రీమియర్‌లను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది.