అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. విజేతలు వీరే

ఆస్కార్‌ - 2024 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ ఈ వేడుకను ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

By అంజి  Published on  11 March 2024 3:23 AM GMT
Oscars 2024 Awards, Oppenheimer, Best Picture, Hollywood

అట్టహాసంగా ఆస్కార్‌ వేడుక.. విజేతలు వీరే

ఆస్కార్‌ - 2024 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్‌ ఈ వేడుకను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ వేడుకకు దేశ, విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్‌ అవార్డులు.. బెస్ట్‌ పిక్చర్‌ అవార్డుతో ముగిశాయి. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో 'పూర్‌ థింగ్స్‌' సినిమాకు అవార్డులు వెలువెత్తాయి. బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్ట్రైలింగ్, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో ఈ చిత్రం అవార్డులు గెల్చుకుంది.

ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌ హైమర్‌)

ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ డైరెక్టర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌ హైమర్‌)

ఉత్తమ చిత్రం: ఓపెన్‌ హైమర్‌

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌ హైమర్‌)

ఉత్తమ సహాయ నటి: డివైన్‌ జాయ్‌ రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్‌ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఏ ఫాల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌

బెస్ట్‌ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌: హెయటే వన్‌ హోయటేమా (ఓపెన్‌ హైమర్‌)

బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌

బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఓపెన్‌ హైమర్‌ (జెన్నిఫర్‌ లేమ్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ద లాస్ట్‌ రిపేర్‌ షాప్‌ (బెన్‌ ఫ్రౌడ్‌పుట్‌, క్రిస్‌ బ్రోవర్స్‌)

బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: 20 డేస్‌ ఇన్‌ మరియూపోల్‌

బెస్ట్‌ సినిమాటోగ్రఫి: ఓపెన్‌

బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ షుగర్‌

బెస్ట్‌ సౌండ్‌: ద జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (టార్న విల్లర్స్‌, జానీ బర్న్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్: ఓపెన్‌ హైమర్‌ (లుడ్విగ్‌ గోరాన్సన్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌: వాట్‌ వాజ్‌ ఐ మేర్‌ ఫర్‌ (బార్బీ)

Next Story