రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది: హాలీవుడ్ స్టార్

S. S. రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా చిత్రం RRR (2022) ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

By M.S.R  Published on  25 May 2024 8:30 AM IST
రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది: హాలీవుడ్ స్టార్

S. S. రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా చిత్రం RRR (2022) ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. భారతదేశంలో అద్భుతమైన బాక్సాఫీస్ రన్ తర్వాత.. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రపంచ దేశాల మూవీ లవర్స్ కు చేరువైంది. ఎంతో మంది ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అగ్రశ్రేణి చిత్రనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో సహా పశ్చిమ దేశాల నుండి మంచి స్పందనను అందుకుంది.

ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ నటి ఈ బ్లాక్ బస్టర్ చిత్రంపై ప్రశంసలు కురిపించింది. ఆమె మరెవరో కాదు 'అన్నే హాత్వే!' ది ప్రిన్సెస్ డైరీస్, ఇంటర్‌స్టెల్లార్, ది డార్క్ నైట్ రైజెస్‌ సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ నటి తెలుగు సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. “నేను అందరిలాగే RRRని ఇష్టపడ్డాను. ఇది అద్భుతంగా ఉంది. ఇందులో భాగమైన వారితో కలిసి పనిచేయాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జక్కన్న పై కూడా ప్రశంసలు కురిపించింది.

Next Story