ప్రముఖ నటుడు విలియం హర్ట్ కన్నుమూత
Oscar winning actor William Hurt passes away. ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియం హర్ట్ కన్నుమూశారు. 71 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించినట్లు యూఎస్ మీడియి తెలిపింది.
By అంజి Published on 14 March 2022 12:54 PM IST
ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియం హర్ట్ కన్నుమూశారు. 71 సంవత్సరాల వయస్సులో ఆయన మరణించినట్లు యూఎస్ మీడియి తెలిపింది. విలియం హర్ట్ "ది బిగ్ చిల్", "ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్" వంటి చాలా ఇష్టపడే చిత్రాలకు ప్రసిద్ధి చెందాడు. ఆస్కార్ అవార్డు పొందిన విలియం.. అతని 72వ పుట్టిన రోజు జరుపుకోవడానికి ఒక వారం ముందు మార్చి 13, 2022న మరణించినందుకు హర్ట్ కుటుంబం చాలా విచారంగా ఉంది. అతను సహజ కారణాలతో కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా మరణించాడు. కాగా విలియంకి మే 2018లో టెర్మినల్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే కొడుకు విల్ ప్రకటనలో విలియం హర్ట్ చనిపోవడానికి ఈ వ్యాధి దోహదపడిందో లేదో పేర్కొనలేదు.
"గోర్కీ పార్క్" (1983)లో రష్యన్ పోలీసు అధికారి, వుడీ అలెన్ యొక్క "ఆలిస్" (1990)లో సంపన్నుడు, "అన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్" (1991)లో సినిమాలో అంధులకు ఉపయోగ పడే మిషన్‌ను తయారు చేసే పాత్రలతో హర్ట్ తన ఖ్యాతిని పెంచుకున్నాడు. కెన్ రస్సెల్ యొక్క 1980 చలన చిత్రం "ఆల్టర్డ్ స్టేట్స్" సినిమాలో శాస్త్రవేత్తగా అతని మొదటి చలనచిత్ర పాత్ర. 1985లో "కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమన్"లో గే ఖైదీగా నటించినందుకు ఉత్తమ నటుడు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. "చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్" (1986) సినిమాలో చెవిటి విద్యార్థుల ఉపాధ్యాయుడిగా, "బ్రాడ్‌కాస్ట్ న్యూస్" (1987)లో స్లో-విట్టెడ్ టెలివిజన్ యాంకర్‌మన్‌గా కూడా హర్ట్ ఆస్కార్‌లకు నామినేట్ అయ్యాడు. "ది ఇన్‌క్రెడిబుల్ హల్క్"తో పాటు.. హర్ట్ పాత్ర "కెప్టెన్ అమెరికా: సివిల్ వార్," "ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్," "ఎవెంజర్స్: ఎండ్‌గేమ్" మరియు "బ్లాక్ విడో" వంటి నాలుగు మార్వెల్ చిత్రాలలో కనిపించింది.