సినీ అభిమానులకు షాక్.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..!
Once Again RRR Movie Release postponed.సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో
By తోట వంశీ కుమార్
సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం,రణం, రుధిరం)' చిత్రం ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. అయితే.. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండడంతో ఈ మూవీని వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.
మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ ఇంకా పలు ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండడంతో పలు రాష్ట్రాలు కూడా ఆంక్షల దిశగా అడుగులు వేసే అవకాశం ఉండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు బావిస్తున్నారట. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేయనుందని సమాచారం.
#RRRMovie Postponed pic.twitter.com/J2NQbJsBei
— Telugu Film Producers Council (@tfpcin) January 1, 2022
అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ చిత్రం వేసవి కానుకగా రానుందని అంటున్నారు.