'ఆర్ఆర్ఆర్' అభిమానుల‌కు షాక్‌.. మ‌రోసారి వాయిదా

Once again RRR Movie postponed.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2021 1:49 PM IST
ఆర్ఆర్ఆర్ అభిమానుల‌కు షాక్‌.. మ‌రోసారి వాయిదా

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'(రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అలియాభ‌ట్, ఒలీవియా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

అక్టోబ‌ర్‌లో విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. తాజాగా మ‌రోసారి ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. ఎప్పుడు విడుద‌ల చేస్తామ‌నే విష‌యాన్ని మాత్రం చిత్ర‌బృందం వెల్ల‌డించ‌లేదు. చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చాలా వ‌ర‌కు పూర్తిచేసిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినిమా థియేట‌ర్లు ఇంకా పూర్తిగా తెర‌చుకోని కార‌ణంగా.. అంద‌రూ అనుకుంటున్న‌ట్లే చిత్ర విడుద‌ల వాయిదా వేస్తున్నామ‌ని ట్వీట్ చేసింది. అయితే.. ఎప్పుడు విడుద‌ల చేస్తార‌నే తేదీని మాత్రం వెల్ల‌డించ‌లేదు. పూర్తిగా స్థాయిలో థియేట‌ర్లు తెర‌చుకున్న అనంత‌రం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.

కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నారు. దాదాపు రూ.450కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మించారు. ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖ‌ని, రేయ్ స్టీవ్‌స‌న్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story