షో మ్యాన్‌తో డైన‌మైట్స్‌.. వైర‌ల్‌

On Prashanth Neel’s Birthday Superstars Prabhas And Yash Come Together To Celebrate.ప్ర‌శాంత్ నీల్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2022 1:19 PM IST
షో మ్యాన్‌తో డైన‌మైట్స్‌.. వైర‌ల్‌

ప్ర‌శాంత్ నీల్‌.. సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత క్రేజ్ ఉన్న ద‌ర్శ‌కుడు. 'కేజీఎఫ్', 'కేజీఎఫ్-2'తో క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కు బ్లాక్ బస్ట‌ర్లు అందిచ‌డంతో స్టార్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడితో చిత్రాలు చేయాల‌ని చాలా మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నార‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ 'స‌లార్ 'చిత్రంలో న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జూన్ 4 ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం రాత్రి ప్ర‌భాస్‌, య‌శ్ లు క‌లిసి ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిపారు. బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ప్ర‌భాస్‌, య‌శ్ లు సంద‌డి చేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ప‌లు ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది.

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఇద్ద‌రు డైన‌మైట్స్(ప్ర‌భాస్, య‌శ్) త‌మ షో మ్యాన్ ప్ర‌శాంత్ నీల్ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించేందుకు ఒకే చోట క‌లిశారు. ఈ వేడుక‌ల కోసం డార్లింగ్ ప్ర‌భాస్ హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వ‌చ్చారు. అని తెలిపింది.

ఇక ఇదే పార్టీలో కేజీఎఫ్-2 చిత్ర 50 రోజుల వేడుక‌లు కూడా జరిగాయి. కాగా.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story