టిక్‌టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ ని 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మైనర్ బాలికను టిక్‌టాక్ వీడియోల పేరుతో నమ్మించి వంచించాడనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో చాలా మంది 'ఓమైగాడ్ నిత్య'పేరును తెరపైకి తీసుకొచ్చారు. చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో నిత్య ఫోటోలను వాడేస్తున్నారు. కాగా.. దీనిపై నిత్య స్పందించింది. ఈ కేసుకి తనకి ఎటువంటి సంబంధం లేదని.. భార్గవ్‌తో మాట్లాడి ఏడాదిపైనే అయ్యిందని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది.
ఫన్ బకెట్ భార్గవ్ రేప్ కేసు విషయంలో అరెస్ట్ అయిన మాట నిజమే అని, కానీ తనకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మీకు ఎలా అయితే సోషల్ మీడియా ద్వారా తెలిసిందో తనకు కూడా అలాగే తెలిసిందని చెప్పింది. తన ఫాలోవర్స్ మెసేజ్ చేయడం వల్ల ఆ న్యూస్ చూశారని తెలిపింది. ''చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు.. ఏం జరిగింది?? అని.. నాకైతే ఏ విషయం తెలియదు.. అసలు నాకు ఆ మ్యాటర్‌కి సంబంధం లేదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు.. భార్గవ్‌ని కలిసి సంవత్సరం పైనే అయ్యింది.. నాకు కాంటాక్ట్‌లో కూడా లేడు. ఇప్పుడు మేం కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మేం హైదరాబాద్‌కి వచ్చేశాం. అయితే ఈ ఇష్యూలో చాలామంది మీమ్స్ చేసేవాళ్లు.. ట్రోలర్స్.. యూట్యూబ్ వాళ్లు నా పేరు వాడుతున్నారు. నా ఫొటోలు వాడుతున్నారు. వీళ్లందరూ తెలియక చేస్తున్నారని తెలిసి.. క్లారిటీ ఇస్తున్నా. మీరు నా ఫొటోలు వాడటం లాంటివి కావాలని చేస్తున్నారని అనుకోవడం లేదు. దయచేసి వాటిని డిలీట్ చేయాలని కోరుతున్నా. మీకు రెండు రోజుల్లో అసలు నిజాలు ఏంటో తెలుస్తుంది'' అంటూ నిత్య తన తల్లితో కలిసి వీడియో విడుదల చేసింది.