ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి చిత్రం

Official Puneeth Rajkumar James OTT Release Date fix.క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ న‌టించిన చివ‌రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2022 10:38 AM GMT
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి చిత్రం

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ న‌టించిన చివ‌రి చిత్రం 'జేమ్స్‌'. చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ ముఖర్జీ, ముఖేష్ రిషి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని పునీత్ అన్నయ్యలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌ కుమార్‌ నిర్మించారు. మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ బాష‌ల్లో సుమారు నాలుగు వేలకు పైగా థియేట‌ర్ల‌లో విడులైంది. అప్పును చివ‌రి సారి వెండితెర‌పై చూసేందుకు అభిమానులు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.

తెరపై పునీత్‌ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఏప్రిల్ 14న ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం సోని లివ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో టాలీవుడ్ న‌టుడు శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించారు. అప్పు చివ‌రి చిత్రం కావ‌డంతో ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

Next Story