'ఐ లవ్‌ యూ సాన్‌' అంటూ సూసైడ్ నోట్ రాసి.. బుల్లితెర న‌టి రష్మీరేఖ ఓజా ఆత్మ‌హ‌త్య‌

Odia TV actor Rashmirekha Ojha found dead at rented home in Odisha.సినీ పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2022 11:32 AM IST
ఐ లవ్‌ యూ సాన్‌ అంటూ సూసైడ్ నోట్ రాసి.. బుల్లితెర న‌టి రష్మీరేఖ ఓజా ఆత్మ‌హ‌త్య‌

సినీ పరిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. భునేశ్వ‌ర్‌లోని గ‌ద‌సాహీ స‌మీపంలోని నాయ‌ప‌ల్లిలో ఓ అద్దె ఇంట్లో నివ‌సిస్తున్న ఆమె జూన్ 18న రాత్రి ఉరివేసుకుని బల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆమె వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాలు. ఇంటి య‌జ‌మాని ఇచ్చిన స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఓ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను చ‌నిపోవ‌డానికి ఎవ‌రూ కార‌ణం కాద‌ని రాసింది. ఇంకా 'ఐ లవ్‌ యూ సాన్' అని రాసి ఉంది.

గ‌త కొన్నాళ్లుగా ఆమె సంతోష్‌ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అత‌డే ఆమె మ‌ర‌ణానికి కార‌ణమై ఉండొచ్చునని రష్మీరేఖ ఓజా తండ్రి ఆరోపించారు. జూన్ 18న త‌న కూతురికి ఫోన్ చేస్తే ఎత్త‌లేద‌ని, ఆ త‌రువాత ఆమె చ‌నిపోయిన‌ట్లు సంతోష్ చెప్పినట్లు ఆయ‌న తెలిపారు. సంతోష్, రష్మీ భార్యభర్తలుగా ఉంటున్నట్లు ఇంటి యజమాని చెప్పేంతవరకూ.. వారిద్దరి గురించి తమకు తెలియదని రష్మీరేఖ తండ్రి పోలీసులకు తెలిపారు. జగత్ సింగ్ పూర్ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్ తో గుర్తింపు పొందింది.

Next Story