రాఘవ లారెన్స్ చాలా రోజుల తర్వాత థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఈ శుక్రవారం లారెన్స్ 'రుద్రుడు'గా తెలుగు ఆడియన్స్ ను పలకరించనున్నాడు. అయితే ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్ గత కొద్దిరోజులుగా వెంటాడింది. అయితే ఎటువంటి సమస్యలు లేవని, అనుకున్న సమయానికే సినిమా విడుదల అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
నిర్మాత ఠాగూర్ మధు ఏప్రిల్ 14న అన్ని చోట్లా సినిమా విడుదల కాబోతున్నట్లు తెలిపారు. నిర్మాత కదిరేశన్ ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా టాలీవుడ్‌లో పిక్సెల్ స్టూడియోస్‌పై నిర్మాత ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు. హిందీతో పాటు ఉత్తరాది పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న రెవెన్సా అనే కంపెనీ సినిమాపై కోర్టుకు వెళ్లడంతో సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డౌట్ అందరికీ వచ్చింది. సినిమా అన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయని, పాన్ ఇండియా చిత్రంగా ఏప్రిల్ 14న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లుగా నిర్మాత ఠాగూర్ మధు తెలిపారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన యాక్షన్ మూవీలో రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించారు.