ఎదురు చూపుల‌కు తెర‌దించిన ఎన్టీఆర్‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభమంటే

NTV Evaru Meelo Koteeswarulu Starts from 22nd august.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పైనా త‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 8:47 AM GMT
ఎదురు చూపుల‌కు తెర‌దించిన ఎన్టీఆర్‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభమంటే

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పైనా త‌న స‌త్తా ఏంటో ఇది వ‌ర‌కే చూపించాడు. 'బిగ్‌బాస్' వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేసింది ఎన్టీఆర్‌. ఒక ర‌కంగా ఆ షోను అంత‌లా ఆద‌రించ‌డానికి కార‌ణం కూడా ఎన్టీఆర్ హోస్టింగ్ అని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అనే కార్య‌క్ర‌మంతో మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు. 'కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది'. రండి గెలుద్దాం 'ఎవరు మీలో కోటీశ్వరు'లు అంటూ చేసిన‌ ప్రోమో ఆక‌ట్టుకుంది.

ఇక ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షో ఎప్పుడు ఏ స‌మ‌యానికి ప్రారంభం అవుతుందో చెప్పేశారు. ఆగ‌స్ట్‌ 22న షో ప్రారంభం కానున్న‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేసిన ఎన్టీఆర్.. సోమ‌వారం నుండి గురువారం వ‌ర‌కు రాత్రి 8.30ల నుండి జెమినీ టీవీలో ప్ర‌సారం కానుంద‌ని తెలియ‌జేశారు.

అయితే.. స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15 నుండి ఈ షో మొద‌లు కానుంద‌ని బావించ‌గా.. వారం రోజుల ఆల‌స్యంగా షోని ప్రారంభిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో పుల్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్త‌య్యాక కొర‌టాల శివ‌తో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు.

Next Story