ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2024 10:46 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే దేవర సినిమా టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా పోస్టుపెట్టారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దేవర విడుదల సందర్భంగా కొత్త జీవోను విడుదల చేయడం.. తెలుగు సినిమా పరిశ్రమకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు సంతోషమన్నారు. అలాగే ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌ కు కూడా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

‘దేవర’ సినిమా టికెట్ల రేటు పెంపు మరియు ఎక్స్‌ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం‌ నుంచి అనుమతులను మంజూరు చేసింది. తొలిరోజు 6 షోలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక టికెట్ రేట్లు మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 135, సింగిల్ స్ర్కీన్ అప్పర్ క్లాస్ రూ. 110, లోయర్ క్లాస్ రూ. 60 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. తారక్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది.



Next Story