ఇది క‌దా ఎన్టీఆర్ అంటే.. తార‌క్ చేసిన ప‌నికి ప్ర‌శంస‌ల వ‌ర్షం

NTR Simplicity at Karnataka Rajyotsava Event.ఎన్టీఆర్‌.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి పూన‌కాలు వ‌చ్చేస్తాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 8:32 AM IST
ఇది క‌దా ఎన్టీఆర్ అంటే.. తార‌క్ చేసిన ప‌నికి ప్ర‌శంస‌ల వ‌ర్షం

ఎన్టీఆర్‌.. ఈ పేరు వింటే చాలు చాలా మందికి పూన‌కాలు వ‌చ్చేస్తాయి. త‌న న‌ట‌న‌తోనే ఎంతో మంది ప్రేక్ష‌కుల మదిలో చెద‌ర‌ని ముద్ర వేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. సింప్లిసిటీ అంటే ఇదీ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం 'కర్ణాటక రాజ్యోత్సవ' వేడుకలను నిర్వ‌హించింది. ఈ వేడుకకు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధామూర్తి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వేదిక‌పై ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. కార్య‌క్ర‌మం ప్రారంభంకంటే ముందు వ‌ర్షం కుర‌వ‌డంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు త‌డిచిపోయాయి.

ఓ క్లాత్‌తో వాటిల్లో ఓ కుర్చీని తుడిచి దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినీని ముందు కూర్చోబెట్టారు ఎన్టీఆర్‌. అనంత‌రం మ‌రో కుర్చీలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిని కూర్చోమని చెప్పి, అనంతరం తాను కూర్చునే కుర్చీని క్లీన్ చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్టీఆర్‌కు ఉన్న గౌరవానికి ఇదే సాక్ష్య‌మని కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, రజనీకాంత్‌, ఎన్టీఆర్‌లు పునీత్‌ సతీమణి అశ్వినీకి పురస్కారాన్ని అందించారు.

అనంత‌రం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను ఇక్కడికి అతిథిగా కాదు అప్పు స్నేహితుడిగానే వ‌చ్చాన‌ని చెప్పారు. అప్పు ఒక గొప్ప‌న‌టుడు, గ్రేట్ డ్యాన్స‌ర్‌, సింగ‌ర్, అంత‌కుమించి ఎంతో గొప్ప వ్య‌క్తిత్వం క‌లిగిన మ‌నిషి. పునీత్ చేసిన సేవ‌లు అత‌డిని ఎన్న‌టికి మ‌న మ‌ధ్య ఉండేలా చేస్తాయి. అప్పుతో గ‌డిపిన క్ష‌ణాలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను అంటూ క‌న్న‌డ‌లో ఎన్టీఆర్ మాట్లాడారు.

Next Story